* కూలిన మట్టిమిద్దె.. తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు మృతి
ఆకేరు న్యూస్, నాగర్‌కర్నూలు : భారీ వర్షానికి తడిచి మట్టి మిద్దె కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. నాగర్‌కర్నూలు (Nagarkurnool) మండలంలోని వనపట్లలో ఈ విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వనపట్లకు చెందిన గొడుగు భాస్కర్‌కు చెందిన ఇళ్లు కుప్పకూలింది (House collapsed). దీంతో ఇంట్లో నిద్రిస్తున్న పద్మతోపాటు ఆమె ఇద్దరు కుమార్తెలు తేజస్విని (6) వసంత (9), కుమారుడు రిత్విక్ అక్కడికక్కడే మరణించారు. తండ్రి భాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు భాస్కర్‌ను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు మట్టిపెళ్లలు తొలగించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఇళ్లు కూలిన ప్రదేశాన్ని ఆర్డీవో, ఎమ్మార్వో పరిశీలించారు.
—————————