Gadwal Vijayalakshmi Telangana Women Commission Chairperson
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఇటీవలి వరకు గ్రేటర్ హైదరాబాద్ కార్పేరేషన్ మేయర్ గా పనిచేసిన గద్వాల విజయ లక్ష్మీ ని నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. సభ్యులుగా శ్రీకాంతా చారి తల్లి కాసోజు శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత లతో పాటు శశికళ, యాదవరెడ్డి, సదాలక్ష్మీ , రాధాబాయి, ఉజ్మా షకీరాలను సభ్యులుగా నియమించారు. మహిళా కమిషన్ ఐదేళ్ళ పాటు పదవీ బాధ్యతలు నిర్వహిస్తారు.

