Gandhi Jayanti 2026
* చైర్ పర్సన్ వినయ్ కుమార్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : ప్రతి పౌరుడు గాంధీ చూపిన అహింస మార్గంలో నడవాలని మున్సిపాలిటీ చైర్ పర్సన్ వినయ్ కుమార్ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధి గాంధీ కూడలిలో, మున్సిపాలిటీ కార్యాలయంలో, శివునిపల్లిలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
“గాంధీ కూడలిలో”
గాంధీ చౌరస్తాలోని మహాత్మా గాంధీ విగ్రహానికి చైర్మన్ తాటికొండ విజయ్ కుమార్, వై చైర్ పర్సన్ రాజమ్మ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావణ్య, మండల పార్టీ అధ్యక్షుడు శిరీష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కిషన్ రాజ్, కౌన్సిలర్లు సంగీత, లక్ష్మి, రాజమ్మ, మధు, రవి, రాజు, కో ఆప్షన్ సభ్యులు గన్ను నరసింహులతోపాటు నాయకులు శ్రీరాములు, జయ పాల్ రెడ్డి, సారంగపాణి, ఫాతి కుమార్, దేవయ్య, మల్లేశం, దయాకర్, పోశాల కృష్ణ, వెంకటయ్య, తదితరులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
“ఆర్యవైశ్య సంఘం”
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బెల్దే వెంకన్న, సరాబు ఆంజనేయులు, జిల్లా రాములు, పార్శి రంగన్న, సోమేశ్వర్, గోలి రాజశేఖర్, శ్రీకాంత్ తదితరులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
“లయన్స్, ప్లాటినం క్లబ్”
జయంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ శివుని పెళ్లి అధ్యక్షులు టి.రవికిరణ్, కోశాధికారి శ్రీకాంత్ వనిత ప్లాటినం క్లబ్ కోశాధికారి సుకన్య, అరుణలు జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
