Hyderabad Metro
* కామన్ పాస్ ఛార్జీలు ఫిక్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ప్రయోజనం కలిగించేలా కామన్ పాస్ విధానం అందుబాటులోకి రానుంది. మెట్రో రైళ్లతో పాటు ఓఆర్ఆర్ పరిధిలో నడిచే అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా పాస్ ఛార్జీలను నిర్ణయించినట్లు సమాచారం.
నెలవారీ కామన్ పాస్: రూ.8,500
మెట్రో వాటా: రూ.7,000
ఆర్టీసీ వాటా: రూ.1,500
రోజువారీ కామన్ పాస్: రూ.400
మెట్రో: రూ.300
ఆర్టీసీ: రూ.100
అదేవిధంగా సిటీ బస్సుల్లో ప్రయాణించేందుకు వారం రోజుల పాస్‌ను రూ.600గా నిర్ణయించినట్లు సమాచారం.
ఈ కామన్ పాస్‌లను ఉపయోగించి మెట్రో రైళ్లతో పాటు ఓఆర్ఆర్ లోపల నడిచే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించనున్నారు.
ఇందుకు సంబంధించిన ‘మీ టికెట్’ యాప్‌ను శుక్రవారం లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ప్రయాణికులకు ఒకే పాస్‌తో మెట్రో–బస్ సేవలు అందుబాటులోకి రావడంతో రోజువారీ రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
