*ఘట్టమనేని వారసుడు జయకృష్ణ గ్రాండ్ ఎంట్రీ!
ఆకేరు న్యూస్,డెస్క్:సూపర్‌స్టార్ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన మనవడు, మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ టాలీవుడ్ వెండితెరకు పరిచయమవుతున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.ఈ సినిమాలో జయకృష్ణ సరసన బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడాని హీరోయిన్గా నటిస్తోంది. ఇద్దరు స్టార్ కిడ్స్ ఒకేసారి పరిచయం కావడం విశేషం.ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య ఒక ఘాటైన లిప్ లాక్ సన్నివేశం ఉండబోతోంది. అజయ్ భూపతి మార్క్ బోల్డ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఇది ఉండనుందని తెలుస్తోంది. వారసుల ఎంట్రీకి తోడు, దర్శకుడి మేకింగ్ స్టైల్ సినిమాపై అప్పుడే క్యూరియాసిటీని పెంచేసింది.తొలి సినిమాతోనే జయకృష్ణ, రషా తడాని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతారో చూడాలి.
