Godavari Flood Water Level
ఆకేరు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా మరియు ఎగువ ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. గడిచిన కొన్ని గంటల్లోనే గోదావరి నీటిమట్టం రెండు అడుగుల మేర పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 10.4 అడుగులకు చేరుకుంది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో, ఇక్కడికి వచ్చే వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
* అధికారులు ఏమంటున్నారంటే..
నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగా హెచ్చరించేందుకు వీలుగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి ప్రమాద స్థాయి కంటే నీటిమట్టం చాలా కిందే ఉన్నప్పటికీ.. ప్రవాహం ఇలాగే కొనసాగితే మొదటి ప్రమాద హెచ్చరిక (43 అడుగులు) దిశగా వెళ్లే అవకాశం ఉందో లేదోనని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
గమనిక: నది వద్దకు వెళ్లే పర్యాటకులు, స్థానిక మత్స్యకారులు ప్రస్తుత పరిస్థితుల్లో గోదావరిలోకి దిగవద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని యంత్రాంగం స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
