GOLD AND SILVER PRICE HIKE
ఆకేరు న్యూస్, డెస్క్: పసిడి ప్రేమికులకు బులియన్ మార్కెట్ మరోసారి షాకిచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు శనివారం మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో స్థానికంగానూ పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
* 24 క్యారెట్ల బంగారం ధర..
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పెట్టుబడులకు అనుకూలమైన 24 క్యారెట్ల (99.9% స్వచ్ఛత) 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 మేర పెరిగింది. దీంతో నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ తులం బంగారం ధర రూ.1,43,950 కి చేరింది.
* 22 క్యారెట్ల బంగారం ధర..
ఇక సాధారణంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా భారీగానే పెరిగింది. రూ.1,100 మేర పెరగడంతో, ప్రస్తుతం మార్కెట్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,31,950 పలుకుతోంది.
* స్థిరంగా వెండి ధరలు..
బంగారంతో పోలిస్తే వెండి ధరలు మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.2.45 లక్షలుగా ఉంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు 3% జీఎస్టీ (GST) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఆభరణాల కొనుగోలుపై ఆయా జువెలరీ దుకాణాలను బట్టి తయారీ కూలి (Making Charges), తరుగు (Wastage) అదనంగా వర్తిస్తాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
