* పసిడి ప్రియులకు టెన్షన్ మొదలు
ఆకేరు న్యూస్, డెస్క్ : రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు రెండు, మూడు రోజులుగా పతనం అవుతూ వస్తున్నాయి. సోమవారం ఆసియా మార్కెట్లలో బంగారం ధరలు 9 శాతం కంటే ఎక్కువ పడిపోయాయి. ఔన్స్ (31.1 గ్రాములు) బంగారం ధర 4,403 డాలర్లకు(సుమారు రూ. 4 లక్షలు) చేరుకుంది. వెండి ధర 15శాతం తగ్గింది. అంతర్జాతీయంగా ఏర్పడిన అస్థిర పరిస్థితుల మధ్య బంగారంలో పెట్టుబడి పెట్టడం సురక్షితంగా భావించడంతో జనవరిలో పుత్తడి ధరలు కొత్త రికార్డులను తాకాయి. అయితే, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్గా సెంట్రల్ బ్యాంక్ మాజీ గవర్నర్ కెవిన్ వార్ష్ పేరు ప్రతిపాదించిన తరువాత మార్కెట్లలో లోహాల ధరలు పతనం కావడం ప్రారంభమైంది. దాదాపు 26 వేల వరకు బంగారం ధర తగ్గిపోయింది. అయితే పడుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.6 వేల వరకు పెరిగింది. అలాగే వెండి ధర కూడా ఈరోజు కిలో 26వేలు పెరిగింది. పెరిగిన ధరతో హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,60,500కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,41,100కు చేరింది. కిలో వెండి ధర రూ.2,85,000కు చేరింది. ధరల పెరుగుదల ప్రారంభంకావడంతో రేపన్న రోజుల్లో అయిన పసిడి కొందామనుకున్న వారిలో టెన్షన్ మొదలైంది.
…………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
