* వరంగల్ ఎంపీ కడియం కావ్య
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెండా ఎగరాలని ఇందుకోసం పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులకు ‘బి ఫాన్స్’ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన నిధులతో 100 పడకల ఆసుపత్రి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, వీటి రోడ్లు సిసి రోడ్లు, నిరంతర విద్యుత్తు కోసం సబ్ స్టేషన్ల నిర్మాణం, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 50 కోట్లు కేటాయించిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు.
అభ్యర్థుల జాబితా
1) వార్డు: సింగపురం దయాకర్ (ఎస్సీ జనరల్)
2) వార్డు: గుర్రం హరినాథ్ (ఎస్సీ జనరల్)
3) వార్డు : గుర్రం హైమ(ఎస్సీ (మహిళా)
4) వార్డు: బూర్ల శంకర్ (బిసి జనరల్)
5) వార్డు: కొంతం రజిత (జనరల్ (మహిళా
6)వార్డు: కనకం రమేష్ (జనరల్)
7) వార్డు: అన్నెపు సుమలత(బిసి (మహిళా
8) వార్డు: సిహెచ్.సత్యనారాయణ (జనరల్)
9) వార్డు: చౌదర్పల్లి సంపత్ రాజు (జనరల్)
10) వార్డు: తోకల అనూష (ఎస్సీ మహిళా)
11) వార్డు: నీల రాజమ్మ (జనరల్ మహిళా)
12) వార్డు: గట్టు సంగీత (జనరల్ మహిళా)
13) వార్డు: తాటికొండ వినయ్(ఎస్సి)
14) వార్డు: పెసరు కృష్ణవేణి (జనరల్ మహిళా)
15) వార్డు: బొల్లు లక్ష్మి (జనరల్ మహిళా)
16) వార్డు: అంగడి రజిత (ఎస్టి)
17) వార్డు: పొన్నం స్వరూప (జనరల్ మహిళా)
18) వార్డు: పొన్న రవి (బీసీ జనరల్)
సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మార్కెట్ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, రజాక్ యాదవ్, ఇల్లందుల విజయ్, పోగుల సారంగపాణి పాల్గొన్నారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
