* ట్రంప్ బెదిరించి ఒప్పందం చేసుకున్నారు
* అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అమెరికాకు అమ్మేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahulgandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై రాహుల్ స్పందించారు. మోదీని ట్రంప్ (Trump) బెదిరించి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. అందుకే మోదీ చాలా భయంతో ఉన్నారని అన్నారు. తీవ్ర ఒత్తిడితోనే మోదీ ఒప్పందంపై సంతకాలు చేశారని విమర్శించారు. రైతుల రక్తమాంసాలు కేంద్రం అమ్ముకుందన్నారు. వాణిజ్య ఒప్పందంపై లోక్ సభలో మోదీ (Modi) సమాధానం చెప్పడం లేదని అన్నారు. చైనాతో సరిహద్దు వివాదంపై కూడా రాహుల్ స్పందించారు. నిన్న సభలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. దేశ భద్రత గురించే తాను మాట్లాడుతున్నా అని స్పష్టం చేశారు. రాహుల్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
………………………………………………………………….
