* 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ
* పాత నిబంధనలే వర్తిస్తాయి
* 16 నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిశీలన
* మంత్రి పొన్నం ప్రభాకర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఈ నెల 26 నుంచి కొత్త రేషన్‌కార్డులను జారీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (MINISTER PONNAM PRABHAKAR)వెల్లడించారు. 16 నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల పరిశీలన చేస్తారని వివరించారు. గతంలో ఉన్న నిబంధనలే వర్తిస్తాయని, కొత్తగా ఎటువంటి నిబంధనలూ పెట్టలేదన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు ఉన్నాయన్నారు. రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ న్యాయం జరిగేలా ప్రజాపాలన ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పేద వాళ్లకు ఇల్లు, స్థలాలు, రేషన్‌కార్డులు(RATION CARDS) అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.. రేషన్‌కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ అర్హులందరికీ వస్తాయన్నారు. ఈ సమావేశంలో కొన్ని మార్గ నిర్దేశకాల గురించి చర్చించామన్నారు.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
