Zoo park inspection by GWMCCommissioner T.Venkanna
* క్షేత్రస్థాయిలో పరిశీలించిన జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
అకేరు న్యూస్, హన్మకొండ : హనుమకొండలోని కాకతీయ జులాజికల్ పార్కులో ప్రతి వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉండి కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్న నేపథ్యంలో, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న జిల్లా అటవీ శాఖాధికారి ముకుందరెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
జూ పార్కులో నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, సహజ నీటి ప్రవాహ మార్గాలు, నాలాలను పరిశీలించిన కమిషనర్, సమస్యకు గల కారణాలను అటవీ శాఖ అధికారులతో చర్చించారు. నాలాల విస్తరణ, డీ-సిల్టింగ్ తదితర చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జూ పార్కులో వర్షపు నీటి నిల్వ సమస్యకు శాస్త్రీయంగా అధ్యయనం చేసి, శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
ఈ పరిశీలనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజు కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికుమార్,అసిస్టెంట్ క్యూరేటర్ మయూరి, బల్దియా డీఈలు, ఏఈలు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
