Danam Nagender Disqualification
* స్టేపై ఉత్కంఠ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ హైకోర్టు తనను అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
ఈ పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు.
మరోవైపు దానం నాగేందర్ పిటిషన్పై తమ వాదనలు కూడా వినాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా కేవియట్ దాఖలు చేసినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.
దీంతో సుప్రీంకోర్టు విచారణపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా హైకోర్టు తీర్పుపై స్టే వస్తుందా లేదా అన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
