ఆకేరు న్యూస్, మహబూబాబాద్: ఆ జనం రోడ్డుపై పడి ఉన్న చేపల కోసం ఎగబడ్డారు. ఎవరికి దొరికినవి వారు తీసుకుని పోయారు. అసలు రోడ్డుపై చేపలు ఏంటనికుంటున్నారా? ఖమ్మం(Khamam) నుంచి వరంగల్(Warangal) వైపు లైవ్ ఫిష్ తో వెళ్తున్న లారీ (Live Fish Lorry) మహబూబాబాద్ జిల్లా మరిపెడలో బోల్తాపడింది. దీంతో ట్రేలలోని చేపలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. జనాలు చేపల కోసం ఎగబడ్డారు. దొరికినకాడికి పట్టుకుపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపుచేశారు. ఈ ఘటనతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్(TrafficJam) ఏర్పడింది. వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ప్రమాదానికి గురైన లారీ అక్కడి నుంచి తొలగించి.. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
