బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
* డెంగీ మరణాలను ఎవరు, ఎందుకు దాస్తున్నారు
* ఎక్స్ లో కేటీఆర్ ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)డిమాండ్ చేశారు. డెంగీ(Dengue) మరణాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతుంది. కానీ వార్తా పత్రికల్లో మాత్రం ఒక్కరోజులో ఐదు మంది డెంగీతో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈరోజు కూడా డెంగీతో మరో ముగ్గురు చనిపోయినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ డేటాను ఎవరు దాచిపెడుతున్నారు..? ఎందుకు దాచిపెడుతున్నారు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులు లేవు.. చాలా హాస్పిటల్స్‌లో ఒక్కో బెడ్‌పై ముగ్గురు, నలుగురు ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని సీరియస్‌గా పరిగణించి, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ(Health Emergency) ప్రకటించాలని సీఎస్ శాంతికుమారి(CS. Shanthikumari)కి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
——————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
