* తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మూడు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ టి. మాధవీ దేవి (Justice T. Madhavi Devi)ఈమేరకు తీర్పు వెలువరించారు. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీతో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసినా ఎన్నికలు జరపడం లేదని నల్గొండ, నిర్మల్, జనగాం, కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురు హైకోర్టు(High court)లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు పిటిషనర్ల వాదనలు పూర్తి కాగా, తీర్పును రిజర్వు చేస్తున హైకోర్టు ప్రకటించింది. విచారణ అనంతరం నేడు తుది తీర్పు వెలువరించింది. ఎన్నికల నిర్వహణకు మూడు నెలల గడువు ఇచ్చింది.
…………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
