Hyderabad Crime
* భార్యను హత్య చేసిన భర్త
Hyderabad Crime| ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్యను రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. అనంతరం నిందితుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
నాలుగేళ్ల కుమారుడు
కడప జిల్లా పులివెందులకు చెందిన వి. నరేందర్‌కు అన్నమయ్య జిల్లాకు చెందిన తేజశ్రీ (28)తో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు రోహిత్ ఉన్నాడు. కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఈ దంపతులు నాలుగు నెలల క్రితం చిక్కడపల్లిలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. నరేందర్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ హోటల్‌తో పాటు అదే భవనంలోని ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
పుట్టింటికి వెళ్తానని చెప్పడంతో..
గత రెండు, మూడు రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం కూడా ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో తేజశ్రీ తాను పుట్టింటికి వెళ్తానని చెప్పడంతో మాటామాటా పెరిగింది. ఆవేశానికి లోనైన నరేందర్ రోకలిబండతో ఆమె తలపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన తేజశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది.
పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు
హత్య అనంతరం నరేందర్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న ఏసీపీ రణవీర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఎల్. మధుబాబు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. అనంతరం తేజశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
