Bethlehem Kudumba Unit
Bethlehem Kudumba Unit| ఆకేరు న్యూస్, డెస్క్: మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit) ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఆగస్టులో థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది.
అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ తేదీని తాజాగా అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 2 నుంచి జియోహాట్స్టార్లో ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జియోహాట్స్టార్ మలయాళం అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.
బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించిందని చిత్ర బృందం తెలిపింది. ‘లోకా చాప్టర్ 1: చంద్ర’, ‘తుడరుమ్’, ‘ఎల్2 ఎంపురాన్’ వంటి చిత్రాలను అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచిందని పేర్కొంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇక అక్టోబర్ 2 నుంచి జియోహాట్స్టార్లో వీక్షించవచ్చు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
