TIMS Hospital Hyderabad
* అత్యాధునిక సేవలతో అందుబాటులోకి..
* రేపు ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
మహానగరంలో మరో అత్యాఽధనిక ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. నిమ్స్ తరహాలో సేవలు అందించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం (ఆగస్టు 17) డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టీమ్స్ ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. ఆస్పత్రి సాధారణ సేవలతో పాటు గుండె సంబంధిత వ్యాధులు, అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలకు ప్రత్యేకంగా నిలవనుంది.
* ఇప్పటికే ట్రయల్ రన్
ఆసుపత్రిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో తెచ్చిన అనంతరం ఎటువంటి అసౌకర్యాలు, ఆటంకాలు ఎదురుకాకుండా ఇప్పటికీ ట్రయల్ రన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రతిరోజు 80 నుంచి 100 మంది వరకు రోగులు చికిత్సల నిమిత్తమై వస్తున్నారు. ట్రయల్ రన్ లో దొర్లిన పొరపాట్లు అసౌకర్యాలను సరిచేసుకుని పూర్తిస్థాయిలో మెరుగైన అత్యాధునిక సేవలను రోగులకు అందించడానికి ఆసుపత్రి సిద్ధమైంది. ఆసుపత్రి నిర్మాణానికి 2022 సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీన అప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి నాలుగు సంవత్సరాల పైనే పట్టింది.
* ఆస్పత్రి ప్రత్యేకతలు
* ఎర్రగడ్డలో 22.6 ఎకరాల్లో నిర్మించారు.
* 11 లక్షల చదరపు అడుగులలో నిర్మాణం
* 1,070 కోట్ల వ్యయం
* 1,082 పడకలు
* జి ప్లస్ 5.. నాలుగు బ్లాక్లు
* 16 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు
* 300 ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు) విభాగాలు
* బి బ్లాక్ లో ఓపిడి నమోదు విభాగం కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, క్యాథలాబ్, సెంట్రలైజ్డ్ ఫార్మసీ
* సి బ్లాక్ లో రేడియాలజీ విభాగం, పాతలాజికల్ ల్యాబ్, జనరల్, ప్రైవేట్, పెయిడ్ వార్డులు
* డి బ్లాక్లో అడ్మినిస్ట్రేటివ్ విభాగం, అకాడమిక్ బ్లాక్, 200 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన ఆడిటోరియం
* రోగుల సహాయకులకు ప్రత్యేకంగా ధర్మశాల
* ఇందులో 200 పడకలు
* గుండె సంబంధిత వ్యాధుల స్పెషాలిటీ
సాధారణ చికిత్సలతో పాటు ఆసుపత్రి గుండె సంబంధిత వ్యాధులకు ప్రత్యేకంగా నిలవనుంది. నగరంలో గుండె సంబంధిత వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడ లేని నేపథ్యంలో సనత్ నగర్ టీమ్స్ ఆస్పత్రిని గుండె సంబంధిత వ్యాధుల చికిత్సకు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇక్కడ గుండె సంబంధిత వ్యాధులకు ప్రత్యేకంగా పడకలను ఏర్పాటు చేశారు. అందులో సిఏబిజి (కారినరీ ఆర్టేరి బైపాస్ గ్రాఫ్) ఆపరేషన్లు, దీనిని బైపాస్ సర్జరీ అని కూడా అంటారు. గుండెలోని వాల్లు బ్లాక్ అయితే వాటిని తొలగించి స్టంటులు వేసే శస్త్ర చికిత్సలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అవయవ మార్పిడి విభాగాన్ని కూడా తీర్చిదిద్దుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
