SRR Foundation Srinivas Reddy
* మానవత్వం చాటుకున్న SRR ఫౌండేషన్ చైర్మన్ బీ ఆర్ ఎస్ జిల్లా నాయకులు
-పరు పాటి శ్రీనివాస్ రెడ్డి
* మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం..
* మనోధైర్యం కల్పించిన వైనం
ఆకేరు న్యూస్,రాయపర్తి:
మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన గూబ సురేష్ కుమార్తె శ్రావణి ఇటీవల ఘట్కేసర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. మెరుగైన వైద్యం కోసం ఆమెను సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శ్రావణి తుదిశ్వాస విడిచింది.
ఈ విషాద వార్త తెలుసుకున్న వెంటనే ఎస్ఆర్ఆర్ (SRR) ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిన శ్రావణి పార్థివదేహానికి పూలమాల వేసి అశ్రునయనాలతో నివాళులర్పించారు. అనంతరం తీవ్ర శోకసంద్రంలో ఉన్న మృతురాలి తండ్రి గూబ సురేష్ మరియు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యాన్ని చెప్పారు. ఫౌండేషన్ తరఫున తక్షణ ఆర్థిక సాయంగా ₹5,000 ల నగదును అందజేశారు.
ఆపదలో ఆదుకోవడంలో ఎప్పుడూ ముందే…
రాయపర్తి మండల పరిధిలోని ఏ గ్రామంలో ఏ ఇంట ఆపద వచ్చినా, యాక్సిడెంట్లు జరిగినా లేదా అనారోగ్యంతో ఎవరైనా మృతి చెందితే శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందిస్తున్నారు. ఏ కష్టం వచ్చినా “నేనున్నాను” అంటూ ముందుకు వచ్చి బాధిత కుటుంబాలకు ఆర్థికంగా, మానసికంగా నిరంతరం అండగా నిలుస్తున్నారు. మండల ప్రజల సంక్షేమం కోసం ఆయన అందిస్తున్న ఈ నిరంతర సేవా కార్యక్రమాలను స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు కొనియాడుతున్నారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
