* కోట్ల విలువైన ఆక్రమణల తొలగింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆక్రమణలపై హైడ్రా మరోసారి కదంతొక్కింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మాదాపూర్ ప్రాంతంలోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో పార్కులతోపాటు రహదారులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా గురువారం కూల్చివేసింది. 22.20 ఎకరాల్లో సుమారు 100 ప్లాట్లతో అనుమతి పొందిన ఈ లే ఔట్లో 4 పార్కులుండగా దాదాపు 2,500 గజాలు గల రెండు పార్కులు , 5 వేల గజాల మేర రోడ్డు కూడా కబ్జాకు గురయ్యాయి., వీటితోపాటు 300 గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన హోటల్ షెడ్‌ను కూడా హైడ్రా తొలగించింది. సుమారు రూ.400కోట్ల విలువైన 16000 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది. 1995లో అనుమతి పొందిన జూబ్లీ ఎన్క్లేవ్ లేఔట్‌ను 2006లో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఈ లేఔట్ ప్రకారం జీహెచ్ ఎంసీకి గిఫ్ట్ డీడ్ చేసిన పార్కులను జైహింద్ రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారంటూ జూబ్లీ ఎన్క్లేవ్ లేఔట్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.అలాగే హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ రహదారికి ఆనుకొని మెటల్ చార్మినార్‌కు ఎదురుగా సుమారు 300 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి.. అనుమతి లేకుండా హోటల్ నిర్మించి అద్దెలకు ఇచ్చారని ఫిర్యాదు చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారించిన హైడ్రా అధికారులు కబ్జాలు వాస్తవమేనని నిర్ధారించుకున్నారు. దీంతో హైడ్రా ఆక్రమణలను గురువారం కూల్చివేసింది.
…………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
