India Junior Women Hockey
Published:
* ఫైనల్లో చైనాపై 1-0 గెలుపు..
* వరుసగా మూడోసారి టైటిల్
అకేరు న్యూస్, ఢిల్లీ: ఆసియా కప్ జూనియర్ మహిళల హాకీలో భారత జట్టు సత్తా చాటింది. ఫైనల్లో చైనాపై 1-0 తేడాతో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఈ విజయంతో భారత్ వరుసగా మూడోసారి ఆసియా కప్ జూనియర్ హాకీ టైటిల్ సాధించింది. కీలక ఫైనల్లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించి చైనాను నిలువరించారు.
ఆసియా కప్ విజేతగా నిలవడంతో భారత జట్టుకు మరో ప్రతిష్ఠాత్మక అవకాశం దక్కింది. ఈ విజయంతో జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్‌కు భారత్ అర్హత సాధించింది. వరుస విజయాలతో భారత జట్టు అంతర్జాతీయ వేదికపై తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.
ఈ వార్తకు సంబంధించిన బృందం

కరస్పాండెంట్
ఇనుగాల కిశోర్ , MA (Mass Communication )
12 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
