Tirumala Devotees Rush
* 18 గంటల సర్వదర్శనం
ఆకేరు న్యూస్, తిరుమల :తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో టోకెన్లు లేని భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు.
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. రద్దీకి అనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
కాగా, నిన్న శ్రీవారిని 78,026 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,116 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.5.12 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
వరుస సెలవులు, ప్రత్యేక పర్వదినాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
