* అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్.మహేందర్ జి.
ఆకేరు న్యూస్, ములుగు: గ్రామ పాలన అధికారులు (జీపీఓ), లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం కోసం ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్.మహేందర్ జి. ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగా, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. గ్రామ పాలన అధికారి పరీక్షకు 27 మంది అభ్యర్థులకు గాను, 26 మంది హాజరయ్యారని, ఒక్కరు గైర్హాజరు అయినట్లు తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షకు సంబంధించిన థియరీ పరీక్షకు 80 మంది అభ్యర్థులకు గాను 71 మంది హాజరయ్యారని, 09 మంది గైర్హాజరు అయినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏ. ఓ. రాజ్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డి తుల రవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
