* వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ఆకేరున్యూస్, వరంగల్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)ను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విద్యార్ధిని, విద్యార్ధులకు, యువతి, యువకులకు ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలింలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఆధ్వర్యంలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఇందుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ (పోలీస్ ఫ్లాగ్ డే) పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈనెల 21 నుంచి 31 వరకు వారోత్సవాలు నిర్వహించబడుతాయని. ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే ఈ మధ్య కాలంలో తీసిన (3) ఫోటోలు మరియు తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 22వ తేదీలోపు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సంబంధిత షార్ట్ ఫిల్మ్ లోడ్ చేసిన పెన్ డ్రైవ్, 10 ఞ 8 సైజ్ ఫోటోలను వరంగల్ పోలీసు కమిషనరేట్ పీఆర్డీఓకు అందజేయాలన్నారు.
ఈ పోటీలకు నామినేషన్లు పంపించే ఔత్సహికులు మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు,అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన,ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ,సైబర్ నేరాలు ఈవ్‌టీజింగ్,ర్యాగింగ్,మత్తు పదార్థాల సేవనం, వాటి అనర్థాలు ఇతర సంద ర్భాల్లో పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలకు సంబంధించి గత సంవత్సరం 2023 అక్టోబర్ నుండి ప్రస్తుత సంవత్సరం అక్టోబర్ నెల ఇప్పటివరకు) తీసిన మూడు ఫోటోలు, షార్ట్ ఫిల్మ్ మాత్రమే పంపించాల్సి వుంటుంది. మరిన్ని వివరాల కోసం 8712685050 నెంబర్ ద్వారా పీఆర్ఓను సంప్రదించాలన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమించి అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహిస్తున్న పోటీలకు విద్యార్థులతో పాటు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ కోరారు.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
