* ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని
* మన కీ బాత్ లో ప్రసంగం
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) జరిగిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా మన్ కీ బాత్ లో మాట్లాడారు. సైనిక చర్యను అభినందించారు. ఉగ్రవాదులపై దాడి సైనిక చర్య మాత్రమే కాదని, అది మన దేశ ధైర్యం, దేశభక్తికి నిదర్శనం అని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టి మన దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఆదివారం నిర్వహించిన మన్‌కీ బాత్ (Mann Ki Baat) లో మోదీ మాట్లాడారు. ఉగ్రవాదనికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో జన్మించిన పిల్లలకు కొందరు సిందూర్ అని పేర్లు పెట్టుకున్నారని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో ప్రజలు తిరంగా యాత్రలు నిర్వహించారని చెప్పారు. పౌర రక్షణ వాలంటీర్లుగా మారేందుకు అనేక నగరాల నుంచి యువత ముందుకు వచ్చారని తెలిపారు. అదేవిధంగా దేశంలో మావోయిస్టుల హింసాత్మక చర్యలు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. దంతెవాడ ఆపరేషన్‌లో జవాన్లు చూపిన సాహసాన్ని కూడా ప్రధాని అభినందించారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
