
* మంత్రి దామోదర రాజనర్సింహ అభినందనలు
* చాలా జాగ్రత్తగా చూసుకున్నారు : జ్యోతిర్మయి
ఆకేరు న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా : వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి మగబిడ్డకు జన్మనిచారు. ప్రసవం నిమిత్తం ప్రభుత్వ జ్యోతిర్మయికి వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (DAMODARA RAJANARSIMHA) అభినందనలు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచారని అన్నారు. జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయి (JYOTHIRMAYI) మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులపై కొందరికి దురభిప్రాయం ఉందని, కానీ ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. వైద్యులు, నర్సులు, సిబ్బంది చాలా జాగ్రత్తగా చూసుకున్నారని అన్నారు. ఎటువంటి సంకోచం లేకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందవచ్చునని వెల్లడించారు.
…………………………………………………….