Kadiyam Srihari
* కడియం
Kadiyam Srihari| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: సమిష్టి కృషితో గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన సుమారు 30 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికలను హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో కడియం శ్రీహరి సమక్షంలో నిర్వహించారు. బీజేపీ బజరంగ్ దళ్ జిల్లా ఉపాధ్యక్షుడు నాయిని అశోక్‌తో పాటు మరో 30 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని, కాంగ్రెస్‌లో జరుగుతున్న చేరికలు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిర్ర నాగరాజు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గడ్డమీది సురేష్, రాజవరం గ్రామ శాఖ అధ్యక్షుడు ఎల్లయ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు సూర్యనారాయణ, యాదగిరి, స్థానిక నాయకులు మోటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
