Kakatiya Medical College ragging
* శాశ్వతంగా హాస్టల్ నుంచి బహిష్కరణ
* కాలేజీ నుంచి 6 నెలల పాటు సస్పెన్షన్
* విద్యార్థుల పై పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు
ఆకేరు న్యూస్, వరంగల్ : అధికారులు ఎన్ని కట్టు దిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ రాగింగ్ భూతం విద్యార్థులను వదిలిపెట్టడం లేదు . వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థుల మద్య ఘర్షణ తలెత్తింది. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను మోకాళ్ళ పై కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేశారని జూనియర్ విద్యార్థులు కళాశాల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాగింగ్ పాల్పడినట్లు తేలిన సీనియర్ విద్యార్థు 7 గురి పై చర్యలు తీసుకున్నారు. ఆరు నెలల పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో పాటు శాశ్వతంగా హాస్టల్ అడ్మిషన్ రద్దు చేశారు. అంతేగాకుండా పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.
*వాట్సప్ చాటింగే గొడవకు కారణం
రాగింగ్ అనగానే కొత్తగా కళాశాల విద్యార్థులు సీనియర్స్ మద్య ఉంటుందని అందరూ భావిస్తారు.. ఇక్కడ మాత్రం ఎంబీబీఎస్ రెండు, మూడవ సంవత్సరాలు చదువుతన్న విద్యార్థుల మద్య రాగింగ్ జరిగింది . రెండవ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థుల వాట్సప్ గ్రూప్ లో మూడవ సంవత్సరం విద్యార్థుల గురించి తప్పుగా మాట్లాడుతున్నారన్న సమాచారం అందుకున్నారు .. తమ గురించి జూనియర్స్ తప్పుగా మాట్లాడడం సరియైనది కాదు.. వారికి బుద్ది చెప్పి తీరాల్సిందే నని సీనియర్స్ నిర్ణయించుకున్నారు.. హాస్టల్ టెర్రస్ పైకి 20 మంది జూనియర్ మెడికోస్ ను పిలిచి మోకాళ్లపై కూర్చో బెట్టి తప్పయిందని..మరోసారి ఇలా చేయమని సారీ చెప్పించుకున్నారు.. ఇతరత్రా ఇబ్బంది పెట్టారని సమాచారం ..ఇది నచ్చని కొంతమంది జూనియర్ విద్యార్థులు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి మొదలు పెట్టి దేశంలో సంబంధిత శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు.. వరంగల్ పోలీస్ కమిషనర్ కు కూడా బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేశారు.. దీంతో కళాశాల అధికారులు రంగంలోకి దిగారు.. యాంటి రాగింగ్ కమిటీ ఇతర అధికారులు పూర్తి స్థాయి విచారణ అనంతరం 7 మంది విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు.

*అవును రాగింగ్ జరిగింది నిజమే..
కాకతీయ మెడికల్ కళాశాలలో రాగింగ్ ఆరోపణల ఫిర్యాదు మేరకు యాంటి రాగింగ్ కమిటీ సమావేశం జరిగింది.. బాధిత విద్యార్థులకు భరోసా కల్పించాం.. మరో సారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు చెప్పాం.
విద్యార్థుల మద్య సుహృధ్బావ వాతావరణం ఉండేలా చూడాలని కేఎంసీ ఆధికారులకు సూచించాం .. రాగింగ్ చేసిన వారి మీద తప్పనిసరిగా చర్యలు ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. అందుకే రాగింగ్ కు పాల్పడిన విద్యార్థులపై చర్యలకు సిఫారసు చేశాం.
————————————————————————–
