Krishnajigudem health center delay protest
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
మంజూరైన హెల్త్ సెంటర్ నిర్మాణంపై నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నిస్తూ కృష్ణాజి గూడెం గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మల్లం రవీందర్, వార్డు సభ్యులు మాట్లాడుతూ కృష్ణాజిగూడెం హెల్త్ సెంటర్ నిర్మాణంపై అధికారుల నిర్లక్ష్యం ఎందుకని
ఎమ్మెల్యే పట్టించుకోవాలని కోరారు. ఏడాది క్రిందట హెల్త్ సెంటర్ నిర్మాణం కోసం 20 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. నిర్మాణం చేపట్టెందుకు ప్రభుత్వ అనుమతి, గ్రామపంచాయతీ తీర్మానం ఉన్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు నిర్మాణ పనుల శంకుస్థాపన పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ పాలకమండలి ప్రతి పక్ష పార్టీ ఐనందుకేనా లేక అధికారులు నిర్లక్ష్యమా? అని వాపోతున్నారు.
నెల రోజుల నుండి కొత్త గా గ్రామపంచాయతి పాలకమండలి ఏఈ దగ్గరకు వెళ్లితే, ఎంపీడీవో దగ్గరకు వెళ్లామన్నారు, అక్కడికి వెళ్లితే, ఆర్డీవో దగ్గరకు వెళ్లమన్నారు, అక్కడికి వెళ్లితే, ఎమ్మెల్యే ను, లేక జిల్లా కలెక్టర్ ని కలవమని సర్పంచ్, వార్డు సభ్యులకు ఉచిత సలహాలు ఇచ్చి పంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మంజూరైన హెల్త్ సెంటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిరసన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లం రవీందర్, వార్డు సభ్యులు సాదం బీమయ్య, పిండి ప్రశాంత్, గ్రామ పెద్దలు పుట్ట బాపురెడ్డి, సాదం రాజేందర్, గద్ద కుమార్, సాదం కృష్ణ లు గ్రామపంచాయతీ ముందు నిరసన వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
