Anganwadi children development
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ అంగన్వాడి కేంద్రంలో గురువారం పిల్లలకు దుస్తుల పంపిణీ, అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రం పరిధిలోని గర్భిణీలు, బాలింతల యోగక్షేమాలు పర్యవేక్షిస్తూ పిల్లల్ని ప్రయోజకుడుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను సక్రమంగా చాలని కోరారు. అంగన్వాడి టీచర్ రాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ నీల రాజమ్మ గట్టయ్య, కౌన్సిలర్ తోకల అనుష రాజు, డాక్టర్ అస్మాన్, ఏఎన్ఎం ప్రేమలత గర్భిణీలు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
