* వెనుక నుంచి కారు ఢీకొనడంతో ప్రమాదం
* కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు
* విద్యార్థులకు స్వల్ప గాయాలు
కమలాపూర్ , ఆకేరు న్యూస్ : స్కూల్ బస్ ను కారు ఢీకొనడంతో పలువురు విద్యార్థులకు గాయాలయినాయి. పోలీసుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఏకశిల పాఠశాలకు చెందిన స్కూల్ బస్ (School bus ) విద్యార్థులతో సాయంత్రం కమలాపూర్ ( Kamalapur ) నుండి కన్నూరుకు వెళుతున్న స్కూల్ బస్ బోల్తా పడింది. ఉమామహేశ్వర్ గార్డెన్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా అదే మార్గంలో కమలాపూర్ నుంచి హుజరాబాద్ వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ( Swift car ) అతివేగంగా వచ్చి స్కూలు బస్ ను వెనకనుంచి ఢీ కొట్టింది. దీంతో స్కూల్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయినాయి. కాగా కారు డ్రైవర్ కు సైతం తీవ్రగాయాలు అయినాయి . సమాచారం తెలుసుకున్న సిఐ హరికృష్ణ ( CI harikrishana ) ,ఎస్ఐలు ప్రమాద సంఘటనకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సిఐ మాట్లాడుతూ స్కూల్ వ్యాన్లో దాదాపు 40 మంది పిల్లలు ఉన్నారు. ప్రమాదంలో వీరికి పలువురు విద్యార్థులకు సల్ప గాయాలు అయినాయి. వెంటనే పోలీస్ వాహనంలో పిల్లలను ఆసుపత్రికి తరలించామని , కారులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను108 వాహనంలో ఎంజీఎం ఆసుపత్రికి తరలించామన్నారు. సహాయక చర్యల అనంతరం క్రేన్ సహాయంతో స్కూల్ బస్ ను పక్కకు జరిపి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేశారు. కార్లో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సీ ఐ హరికృష్ణ తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీలో ప్రమాద వీడియోలు రికార్డయినాయి.
———————————