Kolanpalli News
* మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు
ఆకేరు న్యూస్, రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కోలన్పల్లి గ్రామంలో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. గాజుల దివ్య (24) అత్తగారి ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందాగా. దివ్య మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దివ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు గా సమాచారం. అత్తగారి ఇంట్లో దివ్య మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు.
దివ్య మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఆమె మృతికి సంబంధించిన పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ గ్రామంలో ఆందోళనకు దిగారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దివ్య మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి పోస్టుమార్టం మార్చురీకి తరలించారు.
దివ్య మృతి ఆత్మహత్యా లేక ఇతర కారణాలతో జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు అనంతరం మృతికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
