India Pakistan Asian Games Final
* పురుషుల విభాగంలోనూ భారత్‌దే స్వర్ణం
* పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..
* వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆసియా క్రీడలు 2026 పురుషుల టీ20 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేయగా.. పాకిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులకే పరిమితమైంది.
* అభిషేక్, తిలక్ దూకుడు..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. 28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. ఇందులో కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. పాకిస్థాన్‌పై టీ20ల్లో భారత బ్యాటర్ సాధించిన అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా ఇది నిలిచింది.
చివరి ఓవర్లలో తిలక్ వర్మ భారీ షాట్లతో స్కోరును 200 దాటించాడు. 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శివమ్ దూబే 15 బంతుల్లో 27 పరుగులు చేయడంతో భారత్ 211/6 స్కోరు సాధించింది.
* పాక్ పోరాటం..
212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు భారత బౌలర్లు ఆరంభం నుంచే ఒత్తిడి పెంచారు. అయితే హసన్ నవాజ్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 96 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు చివరి వరకు పోరాడాడు. అయినప్పటికీ భారత బౌలర్లు చివరి దశలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్థాన్ 192/6కే పరిమితమైంది.
* భారత బౌలర్ల ప్రదర్శన..
భారత్ తరఫున అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 29 పరుగులకు 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో 29 పరుగులకు 2 వికెట్లు, శివమ్ దూబే 3 ఓవర్లలో 33 పరుగులకు 2 వికెట్లు తీశారు. జస్ప్రీత్ బుమ్రా వికెట్ తీయకపోయినా.. 4 ఓవర్లలో 33 పరుగులు మాత్రమే ఇచ్చి పాకిస్థాన్ బ్యాటర్లపై ఒత్తిడి కొనసాగించాడు. చివరి ఓవర్లో హసన్ నవాజ్‌ను శివమ్ దూబే అవుట్ చేయడంతో భారత్ విజయం ఖరారైంది.
* భారత్‌కు వరుసగా రెండో గోల్డ్..
ఈ విజయంతో అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్థాన్‌పై భారత్ వరుసగా 7వ విజయాన్ని నమోదు చేసింది. మహిళల జట్టు ఇప్పటికే ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించగా.. ఇప్పుడు పురుషుల జట్టు కూడా గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దీంతో ఆసియా క్రీడలు 2026 పురుషుల టీ20 క్రికెట్లో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
