Komuram Bheem Asifabad python
* కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం..
* పదుల సంఖ్యలో కోడి పిల్లలు హాంఫట్!
కొమురం భీం ఆసిఫాబాద్: జిల్లాలోని రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో గురువారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. ఉపాధి కోసం ఏర్పాటు చేసుకున్న కోళ్ల ఫామ్లోకి ఓ భారీ కొండచిలువ చొరబడి పదుల సంఖ్యలో కోడి పిల్లలను బలిగొంది.
* కోడి పిల్లలను మింగేసిన సరీసృపం..
గోలేటికి చెందిన సుల్వ రాజనర్సు డ్వాక్రా గ్రూప్ ద్వారా ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద పొందిన 25 కోడి పిల్లలను ఎంతో శ్రద్ధగా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో గత రాత్రి ఫామ్లోకి ప్రవేశించిన ఒక భారీ కొండచిలువ ఏకంగా 10 కోడి పిల్లలను కడుపు నిండా మింగేసింది.
అతిగా ఆహారం తీసుకోవడంతో పాటు బరువు పెరగడం వల్ల ఆ కొండచిలువ కదలలేని స్థితిలో అదే ఫామ్లో ఉండిపోయింది. ఉదయం ఫామ్ వద్దకు వెళ్లిన రాజనర్సు అక్కడ భారీ కొండచిలువను చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామస్తులకు తెలియడంతో అక్కడికి భారీగా చేరుకుని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
* భయాందోళనలో స్థానికులు..
అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతాల్లో తరచూ వన్యప్రాణులు ఇలా నివాస ప్రాంతాలు, ఫామ్ల మీద పడుతుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తక్షణమే అటవీశాఖ అధికారులు స్పందించి, ఆ కొండచిలువను సురక్షితంగా బంధించి దట్టమైన అడవిలోకి వదలాలని బాధితుడు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

