GHMC Division Kunamneni Sambasiva Rao
* కాలుష్యం, ట్రాఫిక్, డ్రైనేజీపై ఆందోళన
ఆకేరు న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పునర్వ్యవస్థీకరణ, నగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన బిల్లుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడారు. GHMCని రద్దు చేసి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మూడు కార్పొరేషన్లుగా విభజించడాన్ని స్వాగతించిన ఆయన.. ఆచరణాత్మక సమస్యలకు పరిష్కారం చూపకపోతే హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం సాధ్యం కాదని అన్నారు.
* 3 శాతం భూమిలో 50 శాతం జనాభా
తెలంగాణలో పట్టణీకరణ వేగంగా పెరుగుతోందని కూనంనేని తెలిపారు. రాష్ట్ర మొత్తం వైశాల్యం 1,12,077 చదరపు కిలోమీటర్లు కాగా, పట్టణ ప్రాంతం కేవలం 3 శాతం మాత్రమే ఉందన్నారు. ఈ స్వల్ప భూభాగంలోనే రాష్ట్ర జనాభాలో దాదాపు 50 శాతం మంది నివసిస్తున్నారని పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ జనాభా 77 లక్షలు ఉండగా.. ప్రస్తుతం కోటి 15 లక్షలు దాటిందని తెలిపారు.
* సమగ్ర కోర్ అర్బన్ రీజియన్ అవసరం
ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల విస్తరణతో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని కూనంనేని అన్నారు. నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని అర్బన్ ప్రాంతాలను అనుసంధానిస్తూ సమగ్ర ‘కోర్ అర్బన్ రీజియన్’గా అభివృద్ధి చేయాలని సూచించారు.
* మూడు కార్పొరేషన్లకు కేంద్రీకృత పర్యవేక్షణ
హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించినప్పటికీ.. అభివృద్ధి, పాలనలో సమన్వయం కోసం ఉన్నత స్థాయిలో కేంద్రీకృత వ్యవస్థ అవసరమని కూనంనేని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి లేదా ఉన్నతాధికారుల నేతృత్వంలో మూడు కార్పొరేషన్లను పర్యవేక్షించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
