Waddepally Voter Revision
* అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం
ఆకేరు న్యూస్, హనుమకొండ: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) ప్రక్రియలో భాగంగా వడ్డేపల్లిలో నిర్వహించిన ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి శనివారం పరిశీలించారు. వడ్డేపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 182, 184 పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఓటర్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియను తనిఖీ చేశారు.
* నో మ్యాపింగ్, అనామలీస్ జాబితాల పరిశీలన
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నో మ్యాపింగ్, అనామలీస్ జాబితాల్లో ఉన్న ఓటర్ల వివరాల ధ్రువీకరణ తీరును అదనపు కలెక్టర్ పరిశీలించారు. అలాగే కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల వివరాల్లో మార్పులు, క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణపై బూత్ లెవెల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఎన్. రవి సూచించారు. ఓటర్ల నుంచి వచ్చే క్లెయిమ్లు, అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
బూత్ లెవెల్ అధికారులు తమ పరిధిలోని ఓటర్లకు అవగాహన కల్పిస్తూ, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓ సూపర్వైజర్ కరుణాసాగర్, బూత్ లెవెల్ అధికారులు జ్యోతి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
