Panchayat Funds Freedom
* సర్పంచ్ల హర్షం
* సీఎం, సీతక్కకు పాలాభిషేకం
ఆకేరు న్యూస్, కొత్తగూడ: గ్రామ పంచాయతీలకు సొంత నిధుల వినియోగంలో మరింత స్వేచ్ఛ కల్పించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొత్తగూడ మండల సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు మల్లెల భాగ్యమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
* బ్యాంకు ఖాతాల్లోకే పంచాయతీ ఆదాయం
పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని ట్రెజరీలో జమ చేయకుండా నేరుగా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునే అవకాశం కల్పిస్తూ పంచాయతీరాజ్ చట్టం-2018కు చేసిన సవరణపై సర్పంచ్లు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పంచాయతీ ఆదాయం ట్రెజరీలో జమ కావడంతో అభివృద్ధి పనులకు నిధులు వినియోగించడంలో ఇబ్బందులు ఎదురయ్యేవని తెలిపారు.
* గ్రామాల అభివృద్ధికి ప్రయోజనం
తాజా నిర్ణయంతో పంచాయతీలకు ఆర్థికంగా మరింత స్వేచ్ఛ లభిస్తుందని సర్పంచ్లు పేర్కొన్నారు. గ్రామసభ తీర్మానాల ఆధారంగా స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులను వినియోగించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో పారిశుధ్యం, మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులు మరింత వేగంగా చేపట్టేందుకు వీలుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడంతో పాటు పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపయోగపడుతుందని సర్పంచ్లు అన్నారు. ఈ నిర్ణయానికి కృషి చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
* పాల్గొన్న వారు
కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు మల్లెల భాగ్యమ్మతో పాటు ఈసం పుష్ప, పెనక సిరి వెన్నెల, వసంత, వట్టం శ్రీనుబాబు, వజ్జ అక్షయ్ వర్మ, ఈర్ప రనీత, ధనసరి ముత్తయ్య, వంక రామయ్య, గొంది సోని, ఈక సుమలత, బానోత్ దేవేందర్ తదితర సర్పంచ్లు పాల్గొన్నారు.
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ రూపుసింగ్, మాజీ అధ్యక్షుడు వజ్జ సారయ్య, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి, అధికార ప్రతినిధి ఈర్ప రాజేశ్వర్, యూత్ అధ్యక్షుడు చొప్పరి కుమార్, కాయితోజు ఉపేంద్రచారి, చెన్నూరి మహేందర్, బోడ ఈర్య, నోముల ప్రశాంత్, వల్లెపు రంజిత్, గొంది రాజు, సిరిగిరి సురేష్, నాలి బాలకృష్ణ, యాదగిరి కిరణ్, మూడు రమేష్తో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
