Hanamkonda Poshan Mela
* మాతా, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ఆకేరు న్యూస్, హనుమకొండ: మాతా, శిశు మరణాలను నివారించి ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధించడమే లక్ష్యంగా పోషణ్ మాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి అన్నారు. పోషణ్ మాసం-2026లో భాగంగా శుక్రవారం హనుమకొండలో జిల్లా స్థాయి పోషణ్ మేళా నిర్వహించారు.
ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పోషకాహారాన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో పోషణ్ మాసం కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మేళాలో గర్భిణులకు శ్రీమంతం, ఏడు నెలల చిన్నారులకు అన్నప్రాశన నిర్వహించారు. బాలామృతంతో తయారు చేసిన పోషకాహార వంటకాలతో పాటు వివిధ ఆహార పదార్థాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
