* ప్రత్యేక క్యూలైన్ కోసం స్థానికుల డిమాండ్
* ఆలయంలోకి దూసుకొచ్చిన వేలాదిమంది పట్టణవాసులు
ఆకేరున్యూస్ డెస్క్ : రామేశ్వర ఆలయంలో స్థానికుల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుచేయాలని
పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. రామేశ్వర ఆలయానికి దేశం నలుమూలలనుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో స్థానికులు దైవ దర్శనం చేసుకోవడం ఇబ్బంది అవుతోంది కొంత కాలం క్రితం వరకు రామేశ్వర ఆలయంలో స్థానికులకు ప్రత్యేక క్యూలైన్ ఉండేది. ప్రత్యేక లైన్ ఉండడంతో స్థానికులు సులువుగా దర్శనం చేసుకునే వారు. ఈ నేపధ్యంలో ఆలయ యాజమాన్యం ఇటీవల స్థానికులకు ఉండే ప్రత్యేక క్యూలైన్ ను తొలగించారు. దశాబ్దాల కాలంగా స్థానికుల కోసం ఉన్న ప్రత్యేక క్యూలైన్ ను ఆలయ అధికారులు తొలగించడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆలయ అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు. వేల సంఖ్యలో స్థానికులు గుడి లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. ఆలయ పరిసరాల్లో పోలీసులు ముందస్తు చర్యగా భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. అయినా నగర ప్రజలు ఆలయంలోకి చొచ్చుకొని పోయే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకు్ది.. తొక్కిసలాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
……………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
