Maraboyina Madhusudan Bhatti CPRO
బ్రేకింగ్ న్యూస్
———————-
డిప్యూటీ సీఎం సీపీఆర్ వో మారబోయిన మధుసూదన్ ( 51 ) ఆకస్మిక మృతి
సోమవారం మద్యాహ్నం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు.ఆపోలో స్పెక్ట్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మరోసారి గుండె పోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.
ఆయనకు భార్య జ్యోతి , ఇంజనీరింగ్ చదువుతున్న కుమారుడు ఉన్నారు.
ముప్పయి ఏళ్లుగా జర్నలిజమే వృత్తిగా పనిచేస్తున్నారు.ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ పత్రికల్లో బ్యూరో చీఫ్ గా పలు జిల్లాల్లో పనిచేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా జాయిన్ అయినారు.
కాగా మధుసూదన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుందరెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.
రేపు ఆయన స్వగ్రామం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు.
————————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
