Kamalapur Prajavani Applications
* అందిన 44 దరఖాస్తులు
ఆకేరు న్యూస్, కమలాపూర్ :
మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) కార్యాలయంలో సోమవారం ప్రభుత్వం నూతనంగా చేపట్టిన మండల స్థాయి ప్రజావాణి సహాయ కేంద్రం నిర్వహించారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
శాఖల వారీగా అందిన దరఖాస్తులను పరిశీలిస్తే, అత్యధికంగా హౌసింగ్ శాఖ పరిధిలో 23, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 11, రెవెన్యూ శాఖ పరిధిలో 08, విద్యుత్ శాఖ పరిధిలో 02 చొప్పున మొత్తం 44 దరఖాస్తులు అందినట్లు ఎంపీడీఓ గుండె బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గుండె బాబుతో పాటు తహసీల్దార్ సురేష్ కుమార్, వివిధ శాఖలకు చెందిన మొత్తం 23 విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
