* కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల
ఆకేరు న్యూస్, డెస్క్ : మణిపూర్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. దీంతో మణిపూర్ ముఖ్యమంత్రిగా ఖేమ్చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2017 నుంచి 2022 వరకు ఖేమ్ చంద్ సింగ్ మణిపూర్ స్పీకర్ గా పని చేశారు. 2022లో బీరెన్ సింగ్ సర్కారులో ఆయన పనిచేశారు. కాగా జాతుల ఘర్షణల నేపథ్యంలో మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. ఫిబ్రవరి 2025 నుంచి 11వ సారి రాష్ట్రపతి పాలనలో ఉంది. ఫిబ్రవరి ఆగస్టు 13, 2025 నుంచి మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలనను పొడిగించారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపుకు సంబంధించిన చట్టబద్ధమైన తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. తాజాగా మణిపూర్ లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేయడం గమనార్హం.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
