నీట్ రద్దుపై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా సాగిన వాదనలు.. విచారణ గురువారానికి వాయిదా
* షాదీ డాట్ కామ్ కేసు విచారణలో సుప్రీంకోర్టు
ఆకేరున్యూస్, హైదరాబాద్: పెళ్లి సంబంధాల కోసం వెతికే వేదికలు ప్రముఖ మ్యాట్రిమోనీ సైట్ ‘షాదీ డాట్ కామ’ వేదికగా జరిగిన ఒక భారీ మోసం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజమహేంద్రవరానికి చెందిన చెరుకూరి హర్ష అలియాస్ జోగడ వంశీకృష్ణ అనే వ్యక్తి, షాదీ డాట్ కామ్‌లో ఒక నకిలీ ప్రొఫైల్‌ను సృష్టించాడు. యానాం ఎమ్మెల్యే ఫోటోను వాడుకుంటూ తప్పుడు వివరాలతో యువతులను ఆకర్షించాడు.జూబ్లీహిల్స్‌కు చెందిన ఒక వైద్యురాలు ఈ మాయగాడి వలలో పడింది.తన ఐటీ అకౌంట్లు సీజ్ అయ్యాయని నమ్మించి, ఆమె నుంచి ఏకంగా రూ. 11 లక్షలు వసూలు చేశాడు.డబ్బులు తిరిగి అడిగితే, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఇతను పలువురు యువతులను ఇదే రీతిన మోసం చేసినట్లు విచారణలో తేలింది.ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు, భద్రతాపరమైన లోపాల కారణంగా షాదీ డాట్ కామ్ డైరెక్టర్ అనుపమ్ మిట్టల్, టీమ్ లీడర్ విఘ్నేష్, మేనేజర్ సతీష్‌లపై పోలీసులు ఎఫఐఆర్ నమోదు చేశారు. తమపై నమోదైన కేసును కొట్టివేయాలని వారు తెలంగాణ హైకోర్టును కోరగా, కోర్టు అందుకు నిరాకరించింది.తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. “షాదీ డాట్ కామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు సైబర్ నేరగాళ్లకు మార్గాన్ని సులభతరం చేస్తున్నాయి. సరైన తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి.”అందుకే బాధ్యులపై కేసు నమోదు చేయడం సరైనదేనని అభిప్రాయపడింది. అయితే, ఈ కేసును మరోసారి పరిశీలించి, స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టుకు సూచిస్తూ విచారణను ముగించింది.
……………………………………….
