* ఆల్‌టైం రికార్డు స్థాయికి నిఫ్టీ
ఆకేరు న్యూస్ డెస్క్ : ఎగ్జిట్ ఫోల్స్ రాజకీయ నేతల్లో ఎలాంటి ప్రభావం చూపాయనేది పక్కన పెడితే.. మదుపర్లలో ఉత్సాహాన్ని నింపాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్ లాభాల్లోకి దూసుకెళ్లింది. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో సోమవారం భారత షేర్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నిఫ్టీ 50 3.58% జంప్ చేయగా.. సెన్సెక్స్ 3.55% లాభపడింది. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిల్లో ఉండగా..నిఫ్టీ బ్యాంక్ తొలిసారి 50,000 దాటింది . ఫిబ్రవరి నుంచి అత్యుత్తమ ఇంట్రాడే లాభాలతో ఆల్-టైమ్ గరిష్టాలను తాకడంతో ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో అన్ని ప్రధాన రంగాల స్టాక్స్ బాగా పెరిగాయి. ముఖ్యంగా స్మాల్, మిడ్ క్యాప్‌లు కూడా గణనీయమైన లాభాలను చవి చూశాయి. అధికార పక్షానికి మూడింటిలో.. రెండు వంతుల మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ సూచించడంతో.. స్టాక్ మార్కెట్ రయ్ మని దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ విశ్వసనీయతపై అన్ని వర్గాలలో మిశ్రమ స్పందన ఉన్నా.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ మాత్రం పాజిటివ్ గా రెస్పాండ్ అవడం చూసి నిపుణులు ఆశ్చర్యపోతున్నారు.
——————–