Bhatti TNGOs Leaders Meeting
ఆకేరు న్యూస్,హన్మకొండ:
వరంగల్ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్కని టీఎన్జీవోస్ (TNGOs) యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు, టీజేఏసీ (TJAC) జిల్లా చైర్మన్ ఆకుల రాజేందర్, హనుమకొండ జిల్లా కార్యదర్శి కత్తి (బైరి) సోమయ్య,లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రికి టీఎన్జీవోస్ సంఘం నాయకులు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం మరియు వివిధ సమస్యలపై ఉపముఖ్యమంత్రితో స్థానిక టీఎన్జీవో నేతలు సానుకూలంగా చర్చించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి టీఎన్జీవోస్ యూనియన్ ఎల్లప్పుడూ పూర్తి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా ఆకుల రాజేందర్, కత్తి (బైరి) సోమయ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ హనుమకొండ జిల్లా బాధ్యులు, ఇతర సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
