* జాకారం నుండి ట్రాఫిక్ జామ్..
* పస్రా దగ్గర మూడు గంటల నుంచి ట్రాఫిక్ జామ్
ఆకేరు న్యూస్,మేడారం: జాతర చివరి రోజు కావడంతో రోడ్లపై వాహనాలు జామ్ ,భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మక్క సారాలమ్మ తల్లులు వనంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండడంతో పెద్దఎత్తున భక్తులు అమ్మవార్లను దర్శించుకొనున్నారుమేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు చివరి రోజు కావడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి. ట్రాఫిక్ లో చిక్కుకోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.సమ్మక్క సారలమ్మ తల్లులను ఈరోజు వనంలోకి చేరడానికి సిద్ధపడుతున్న క్రమంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.ట్రాఫిక్ సమస్య పూర్తిగా అస్తవ్యస్తం కావడంతో పోలీసులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 నిమిషాల నుండి బస్సులు కదలకుండా ఉండడంతో చిన్నపిల్లలు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేస్తామన్న అధికారులు ఎక్కడున్నారంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు చివరి రోజు ఫెయిల్యూర్ అయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
………………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
