* కొండా మురళి వ్యాఖ్యలే కారణం?
ఆకేరు న్యూస్, వరంగల్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి (KONDA MURALI) చేసిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లోని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి (MLA NAYINI RAJENDER REDDY) కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు శుక్రవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ కీలక సమావేశానికి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, విజయరామారావు, మాజీ ఎంపీ సుధారాణి హాజరయ్యారు. కొండా మురళి చేసిన వ్యాఖ్యలు, పార్టీలోని సీనియర్ నేతలను ఉద్దేశించి ఆయన చేసిన ఆరోపణలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. గురువారం వరంగల్ నగరంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొండా మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తన కుమార్తె సుస్మిత పోటీ చేస్తుందని ప్రకటించారు. అదే సమయంలో పార్టీలోని కొందరు సీనియర్ నేతలపై, ముఖ్యంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
