ఆకేరున్యూస్, హైదరాబాద్: కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీకి రాకపోవడంపై మంత్రి కొండా సురేఖ తనదైన శైలిలో సెటైర్ వేశారు. నిన్న జరిగిన భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లో కోహ్లీ బద్దలు కొట్టిన రికార్డును ప్రస్తావిస్తూ మాజీ సీఎంపై మంత్రి కొండా సురేఖ పలు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం పెద్ద రికార్డే కదా అంటూ సెటైర్ వేశారు. దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా ఘన విజయం సాధించడం హర్షణీయమన్నారు. 6 వికెట్ల తేడాతో భారత్ బంపర్ విక్టరీ కొట్టిన విషయం అందరం టీవీలో చూసి సంబురపడ్డామన్నారు. 14 వేల రన్నులు కొట్టి విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టగా… మన రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా దాదాపు ఈ 14 నెలల కాలంలో 14 రోజులు కూడా అసెంబ్లీకి రాలేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రజలకి అందుబాటులో ఉండకపోవడం దేశ రాజకీయ చరిత్రలో పెద్ద రికార్డే కదా అంటూ ఎద్దేవా చేశారు. 14 వేల రన్నులు చేసిన విరాట్ కోహ్లీ ఒకవైపు వార్తల్లో పతాక శీర్షికలలో నిలిస్తే… 14 నెలలుగా ఇంకా విరాట పర్వం వీడని ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా వార్తల్లోకి ఎక్కడం ఆలోచించాల్సిన విషయం కాదా? అంటూ మంత్రి సురేఖ ట్వీట్ చేశారు.
…………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
