Seethakka Inspects Tribal Ashram School
* విద్యార్థులకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలి
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఆకులవారి ఘనపూర్ ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి గురువారం సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి దనసరి అనసూయ సీతక్క వసతి గృహంలోని మరుగుదొడ్లు, వంటశాల, తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు నాణ్యంగా ఉండేలా చూడాలని, ప్రభుత్వ వసతి గృహాలలో పరిశుభ్రత, భోజన నాణ్యత, మరుగుదొడ్లు, తరగతి గదులు వంటి మౌలిక సదుపాయాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం మంత్రి సీతక్క విద్యార్థులతో మాట్లాడి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని, వారితో కలిసి అల్పాహారం నాణ్యతను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లెనిన్ వత్సల్ టోప్పో, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి,
గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు పిరంగి,జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
